కావలసిన పదార్థములు:
మైదా: 1 కిలో
మినప్పప్పు: 1 డబ్బా
పచ్చి శనగపప్పు:
ఒకటిన్నర డబ్బా
కొబ్బరి: 1 డబ్బా
నువ్వులు: 50 గ్రాములు
పంచదార: 3 డబ్బాలు
యాలకుపొడి: తగినంత
తయారు
చేయు విధానం:
- ముందుగా మినప్పప్పు, శనగపప్పు విడి విడిగా వేయించుకొని పిండి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
- కొబ్బరి తురుముకోవాలి, పంచదార కూడా మిక్సీ వేసి పెట్టుకోవాలి.
- మిక్సీ వేసిన పిండ్లు, కొబ్బరి తురుము, పంచదార, యాలకుపొడి కలిపి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మైదా పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి.
- మైదాపిండిని చిన్న చిన్న పూరీలుగా వత్తుకుని కజ్జికాయల చెక్కలో పెట్టి అందులో పై మిశ్రమాన్ని ఉంచి మూసేయాలి.
- చివరిగా నూనెలో డీప్ ఫ్రై చేయాలి.
- మీకు కావలసిన కజ్జికాయలు రెడీ
No comments:
Post a Comment