- See more at: http://mybloggerwidgets.blogspot.in/2013/03/add-floating-facebook-like-box-in.html#sthash.2Osw38PV.dpuf

Saturday 3 November 2018

సైనసైటిస్


పావు లీటరు నీటిలో ఒక గుప్పెడు పుదీనా ఆకులు, వేయించిన వాము పొడి ఒక గ్రాము, పసుపు ఒక గ్రాము, వేసి బాగా మరిగిస్తూ (స్టవ్ మీదనే ఉంచి)ఆవిరి పట్టడం వల్ల త్వరగా సైనసైటిస్ తగ్గుతుంది.
లేదా
 పావు లీటరు నీటిలో ఒక గుప్పెడు పుదీనా ఆకులు, వేయించిన వాము పొడి ఒక గ్రాము, పసుపు ఒక గ్రాము, వేసి బాగా మరిగించి దింపి చల్లార్చి వడకట్టి పెట్టుకోవాలి. ఇందులో చిటికెడు ఉప్పు వేసుకొని రోజుకు రెండుసార్లు త్రాగుతూ ఉంటే సైనసైటిస్ ఇబ్బంది తొలగుతుంది.

రక్తహీనత


నల్ల నువ్వులు 50gms
ఎండు ఖర్జూరం పొడి 50gms
వేరుశనగ గుండ్ల పొడి 50gms
బెల్లం పొడి 50gms
నల్లనువ్వులు, వేరుశనగ గుండ్లు వేయించి పొడి చేసుకోవాలి. అలాగే ఖర్జూరాలు గింజ తీసి పొడి చేసి పెట్టుకోవాలి. బెల్లం కూడా పొడి చేసుకొని అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.  
ఈవిధంగా తయారు చేసుకున్న దానిని రోజూ ఉసిరికాయ ప్రమాణంలో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకొని గోరువెచ్చని పాలు త్రాగితే రక్తహీనత తగ్గుతుంది.
---------
100గ్రాముల తేనెలో 25 గ్రాముల ఎండు ఖర్జూరం ముక్కలు, 25 గ్రాముల బాదం పలుకులు, 25 గ్రాముల కిస్ మిస్ లు, 25 గ్రాముల పటికబెల్లం పొడి వేసి కలిపి ఉంచుకొని రోజూ ఉదయం సాయంత్రం ఒక స్పూన్ తీసుకుని ఒక కప్పు గోరువెచ్చని పాలు త్రాగుతూ ఉంటే రక్తహీనత తగ్గుతుంది.   

Tuesday 15 May 2018

బూడిదగుమ్మడికాయ బరడా

1/2 కిలో గుమ్మడి కాయ ముక్కలు పెద్ద సైజ్
100 gm పెసర పప్పు
100gm శనగ పప్పు
20gm జీలకర్ర
కొంచం ఇంగువ
ఉప్పు  కారం పసుపు దన్యాల పొడి తగినంత
2 పెద్ద నిమ్మ కాయలు
150ml నూనె

తయారీ 

మొదలు గుమ్మడి కాయ ముక్కలు పెద్ద సైజ్ అనగా కనీసం 2 inch ఉండేలా తరగాలి . పెసర పప్పు  శనగ పప్పు జీలకర్ర  ఇంగువ కలిపి మిక్సి లో  రవ్వలాగా ఆడించాలి .అదే బరడా. బాణాలి లో కాస్త నూనె వేసి  ఆవాలు జీలకర్ర వేగిన తరువాత గుమ్మడి ముక్కలు వేసి  రెండు గ్లాసుల నీళ్ళు పోసి ముక్కలకు తగినంత కారం పసుపు ధన్యాల పొడి ఉప్పు వేసి 10 నిముషాలు ముక్క కాస్త మెత్తబడే  వరకు ఉంచాలి . ఈ బరడా లో తగినంత కారం ఉప్పు కాస్త నూనె వేసి కలిపి ఉడుకుతున్న  ముక్కల్లో కలపాలి  రెండు కలిపి ఇంకొక పది నిముషాలు ఉడికించాలి .ఇప్పుడు రెండు నిమ్మకాయలు కూరలో పిండేసి కలిపి మూత పెట్టండి . అంతే కనీ వినీ ఎరుగని కమ్మని గుమ్మడి కాయ కూర రెడీ .

Thursday 3 May 2018

గుమ్మడి వడియాలు

కావలసినవి:
బూడిద గుమ్మడికాయ - చిన్నది ఒకటి
మినప్పప్పు - అర కేజీ
పచ్చిమిర్చి - 150గ్రా.
ఇంగువ - కొద్దిగా
ఉప్పు - తగినంత

బూడిద గుమ్మడి కాయ మీద ఉండే బూడిదను శుభ్రంగా బట్టతో తుడిచేయాలి. ముందురోజే కాయను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. ఉప్పు కలిపిన ముక్కల్ని పలుచని బట్టలో వేసి మూటలా కట్టాలి. ఈ మూటను ఎత్తుగా ఉండే పీటమీద పెట్టి దానిమీద పెద్ద బరువు ఉంచాలి. అలా చేయడం వల్ల ముక్కల్లోని నీరంతా బయటకు వచ్చేస్తుంది. ముందు రోజు రాత్రే నానబెట్టిన మినప్పప్పుని గారెల పిండిలా గట్టిగా రుబ్బాలి. ఈ మినప్పిండిలో నీరు పిండిన ముక్కలు, ఉప్పు, ఇంగువ కలుపుకుని ఎండలో బట్టమీద కావలసిన సైజులో వదియాలుగా పెట్టుకోవాలి. రెండు మూడూ రోజులు మంచి ఎండలో ఎండిన తరువాత ఒలిచి మరోసారి తిరగేసి వదియాల్ని ఆరబెట్టి డబ్బాలో పెడితే సంవత్సరమంతా నిల్వ ఉంటాయి. ముక్కలుగా ఇష్టం లేని వారు గుమ్మడికాయను తురుముకోవచ్చు. తురుముతో అయితే పెద్ద వడియాలు కాకుండా చిట్టి వడియాలుగా పెట్టుకుంటే బాగుంటాయి.

Friday 16 June 2017