పండు మిరపకాయలు - 1kg
చింతపండు - 200gms
ఉప్పు - అరసోలెడు
పసుపు
మెంతిపిండి - అరగిద్ద
ఆవాలు
నూనె
కరివేపాకు
తయారుచేయు విధానం:
౧. ముందుగా మిరపకాయలను తడిలేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి
౨. చింతపండును శుభ్రంచేసి పెట్టుకోవాలి.
౩. పండు మిరపకాయలను కచ్చాపచ్చాగా నూరుకొని చింతపండు, ఉప్పు, పసుపు కలిపి ఉంచుకోవాలి.
౪. మూడవరోజున ఆ మిశ్రమాన్ని మెంతిపిండి కూడా వేసి గ్రైండ్ చేసుకొని జాడీలో పెట్టుకోవాలి.
౫. మనకు కావలసినప్పుడు కొంత పచ్చడి తీసుకొని తిరగమాత వేసుకుంటే సరి.
౬. రుచికరమైన పండుమిరపకాయ పచ్చడి రెడీ.
No comments:
Post a Comment