కావలసిన పదార్థములు:
జీడిపప్పు - 2 టీ స్పూన్స్
యాలకులు - 2
శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
దాల్చినచెక్క - `1 అంగుళం ముక్క
లవంగాలు - 2
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర లేక సోపు - 1 టీస్పూన్
తురిమిన కొబ్బరి - 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి - 4
కరివేపాకు
ఇంగువ - చిటికెడు
కూరముక్కలు - 2 కప్పులు
(క్యారెట్, బీన్స్, వంకాయ, ఉల్లిపాయ, టొమాటొ, ములక్కాడ)
ఆవాలు - అర స్పూన్
నూనె- 1టీస్పూన్
బియ్యం - 1 కప్
ఉప్పు - రుచికి సరిపడినంత
చింతపండు రసం - 20 గ్రాములు
కందిపప్పు - అర కప్పు
పసుపు - పావు టీస్పూన్
మినప్పప్పు - 1టేబుల్ స్పూన్
(కావలసిన వారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు)
తయారుచేయు విధానం:
౧. ముందుగా స్టవ్ పై బాణలి ఉంచి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, జీడిపప్పు ముక్కలు, వేయాలి.
౨. పైవి అన్నీ వేగాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఇంగువ, తరిగిన కూరగాయ ముక్కలు, పసుపు వేసి కొంచెంసేపు ఉడికించాలి.
౩. తర్వాత వాటికి కందిపప్పు, బియ్యం చేర్చి, కావలసినన్ని నీరు పోసి ఉడికించుకోవాలి.
౪. 3/4 వంతు అన్నం ఉడికాక అందులో టొమాటో ముక్కలు,వేసి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
౫. అన్నం ఉడికింది అనుకున్నాక మనం తయారుచేసుకున్న పౌడర్ దానికి చేర్చాలి.
౬. అందులో చింతపండు రసం చేర్చి ఉడికాయి అనుకున్నాక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
బూందీ, రైతా తో బిసిబిల్లా బాత్ చాలా రుచిగా ఉంటుంది.
పౌడర్ తయారీ:
1. స్టవ్ మీద బాణలి పెట్టి, ఎండుమిర్చి, మెంతులు (చాలా కొంచెం), ఆవాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు నూనెలేకుండా సన్న మంటపై వేయించుకోవాలి.
౨. అవి కొంచెం వేగాక అందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేయాలి. అవి కూడా కొంచెం వేగాక శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి. అందులోనే చివరిగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి.
౩. అన్నింటినీ మిక్సీ వేసి పొడి చేసుకోవాలి.

No comments:
Post a Comment