కావలసిన పదార్థములు:
కొబ్బరి - రెండు చిప్పలు
పచ్చి మిరపకాయలు - 8 నుంచి 10
చింతపండు - చిన్న నిమ్మకాయంత
నూనె - 3టీస్పూన్స్
పచ్చి శనగపప్పు - 2టీస్పూన్స్
మినప్పప్పు - 2టీస్పూన్స్
ఆవాలు - 1టీస్పూన్
జీలకర్ర - 1టీస్పూన్
ఉప్పు తగినంత
ఇంగువ - కొంచెం
కొత్తిమీర
తయారు చేయువిధానం:
౧. కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పచ్చిమిర్చిని కడిగి ఉంచుకోవాలి.
౨. బాణలిని వేడి చేసి నూనె వేడెక్కాక మినప్పప్పు, శనగపప్పు గోధుమరంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడే వరకు ఉంచాలి. చివరిగా ఇంగువ, కరివేపాకు వేయాలి.
౩. మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా పచ్చిమిర్చి, చింతపండు, కొబ్బరిముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా తిరగమాత (పోపు) వేసి మిక్సీలో ఒక తిప్పు తిప్పాలి.
౪. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
గమనిక: మిగతా చట్నీలతో పోలిస్తే ఈ చట్నీలో ఉప్పు తక్కువగా పడుతుంది.

No comments:
Post a Comment