కావలసిన పదార్ధాలు :
సెనగ పప్పు : పావు గ్లాసు
పెసర పప్పు : పావు గ్లాసు
బియ్యం పిండి : ఒక గ్లాసు
జీలకర్ర : చిటికెడు
కారం, ఉప్పు : తగినంత
నూనె : వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:
చిట్టి గారెలు చేసుకోవాలంటే ముందుగా శనగ పప్పు, పెసర పప్పు పావు గంట నాన బెట్టుకోవాలి. ఇవి నానిన తర్వాత బియ్యం పిండిని తీసుకోవాలి. అందులో నానిన శనగ పప్పు, పెసర పప్పు, జీలకర్ర, తగినంత కారం, ఉప్పు వేసి బాగా కలుపు కోవాలి. అప్పుడు వేడి నీళ్ళతో ఈ మిశ్రమాన్ని గట్టి ముద్దలాగా చపాతీ పిండి అంత గట్టి గా కలుపుకుని, అర గంట సేపు మూత పెట్టి ఉంచుకోవాలి.
ఒక శుబ్రమైన గుడ్డను తీసుకుని, తడిపి, బాగా పిండి టేబుల్ మీద పరుచుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా గోళికాయ పరిమాణం లో చేసుకుని, అంగుళం అంగుళం దూరంలో తడిపి పిండిన గుడ్డ మీద ఒక సగభాగం లో పరుచుకోవాలి. మిగతా సగం గుడ్డను ఈ ఉండల మీద కప్పాలి. ఒక గ్లాస్ తో ఈ ఉండల మీద వున్న గుడ్డ మీద గట్టిగా నొక్కాలి. ఉండలు పలుచగా బిస్కట్స్ షేప్ లో వస్తాయి.
ఒక మూకుడు లో నూనె వేసి, బాగా కాగిన తర్వాత సన్న సెగ లో పెట్టుకుని ఈ బిళ్ళల్ని కరకర లాడేలా వేయించుకోవాలి. డబ్బాలో వేసి గాలి తగలకుండా పెట్టుకుంటే పది పదిహేను రోజుల దాకా నిలవ వుంటాయి.

No comments:
Post a Comment