- See more at: http://mybloggerwidgets.blogspot.in/2013/03/add-floating-facebook-like-box-in.html#sthash.2Osw38PV.dpuf

Tuesday, 30 September 2014

క్షీరాన్నం


కావలిసిన వస్తువులు: 
ఒక లీటర్ ఆవు పాలు, 
రెండు గ్లాసుల బియ్యం
చారెడు పెసరపప్పు, [శుభానికి చేసుకునే పరమాన్నం ఎప్పుడూ బియ్యానికి పెసరబద్దలు కాని శనగ పప్పు కాని వేయకుండా చేయకూడదని పెద్దలు చెపుతారు)
బెల్లం  
యాలకులు-6, 
జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు, కిస్మిస్ సరిపడా. 

తయారు చేసే విధానం: 
ముందుగా ఒక దళసరి గిన్నె శుభ్రంగా కడిగి అందులో పాలు పోసి స్టవ్ మీద పెట్టాలి. 
బియ్యం రాళ్ళు అవి లేకుండా శుభ్రం చేసుకోవాలి. దైవ కార్యానికై పరమాన్నం చేసేటప్పుడూ తడిబియ్యం వాడకూడదు అంటారు. 
అందుకనే పాలు కాగాక, పొడి బియ్యం, పెసరపప్పు పాలల్లో వేసి, సన్న సెగ మీద ఉడకనివ్వాలి. అడుగంటకుండా మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. 
అన్నం ఉడకటానికి వచ్చినప్పుడు బెల్లం కూడా కలిపి కలుపుతూ ఇంకొం చెంసేపు అంటే ఒక అయిదు నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఒక బుల్లి మూకుడు స్టవ్ మీద పెట్టి, రెండు చెంచాల నెయ్యి వేసి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి వేయించి, ఉడుకుతున్న పరమాన్నంలో కలపాలి స్టవ్ ఆర్పేసి పరమాన్నం కిందకు దించేయండి. యాలకులను పొడి చేసి క్షీరాన్నం లో కలపండి. క్షీరాన్నం తయారైపోయింది.

No comments:

Post a Comment