కావలిసిన పదార్థములు:
ఒక గ్లాసు మినప్పప్పు, ఒక అరగ్లాసు బియ్యం, ఒక గ్లాసు పచ్చిశనగ పప్పు, గ్లాసుడు బెల్లం పొడి,యాలుకులు -6, పూర్ణాలు వేయించడానికి సరి పడ నూనె.
తయారు చేయువిధానం:
మినప్పప్పు, బియ్యం నాలుగైదు గంటల ముందుగా నానబెట్టుకోవాలి.
ఒక గ్లాసు మినప్పప్పు, ఒక అరగ్లాసు బియ్యం, ఒక గ్లాసు పచ్చిశనగ పప్పు, గ్లాసుడు బెల్లం పొడి,యాలుకులు -6, పూర్ణాలు వేయించడానికి సరి పడ నూనె.
తయారు చేయువిధానం:
మినప్పప్పు, బియ్యం నాలుగైదు గంటల ముందుగా నానబెట్టుకోవాలి.
శనగ పప్పు ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు పోసి,
కుక్కర్లో కాకుండా విడిగా ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత పప్పుని నీళ్లన్నీ ఓడ్చి, ఒక చిల్లుల పళ్ళెం లో ఆరబెట్టుకోవాలి. నీళ్లు
మొత్తం పోయి ఆరతాయి.
ఇప్పుడు బెల్లం పొడిని ఒక దళసరి మూకుడులో వేసి
తడవడానికి సరిపడా నీళ్లు పోసి, స్టవ్ మీద పెట్టాలి.
పాకం తయారయ్యే లోపు ఆరిన
శనగపప్పు, యాలకులను మిక్సీ లో వేసి పొడిగా చేసుకోవాలి. దీనిని ఉడుకుతున్న
పాకం లో వేసి గట్టి పడి ఉండ పాకం వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడు స్టవ్
మీదనుండి దింపి చల్లారనివ్వాలి.
ఈ లోగా మనం నానబెట్టుకున్న మినప్పప్పు,
బియ్యం గ్రైండర్ లో మెత్తగా జాలు వారుగా బజ్జీ పిండి లాగా తోపు పిండి చేసుకోవాలి.
చల్లారిన శనగ పప్పు,
బెల్లం పాకాన్ని కొంచెం నెయ్యి చేతికి రాసుకుంటూ, గుండ్రటి ఉండలుగా నిమ్మకాయ పరిమాణం లో చేసుకోవాలి.
ఈ
పూర్ణం ఉండలని తోపులో ముంచి, కాగిన నూనెలో వేసి బంగారం రంగులో వేయించుకోవాలి.
అమ్మ వారికిష్టమైన పూర్ణం బూరెలు సిద్దం.
No comments:
Post a Comment