- See more at: http://mybloggerwidgets.blogspot.in/2013/03/add-floating-facebook-like-box-in.html#sthash.2Osw38PV.dpuf

Saturday, 24 January 2015

అరిసెలు

బియ్యం - 1kg
బెల్లం - 3/4kg
నువ్వులు - అరకప్పు
యాలకు పొడి - కావలసినంత
నెయ్యి/నూనె - వేయించుకోవడానికి సరిపడినంత
తయారుచేయు విధానం:
1. ఒకరోజు ముందుగా బియ్యాన్ని నానబెట్టి పిండి కొట్టుకోవాలి.
2. బెల్లాన్ని మెత్తగా తరిగి ఉంచుకోవాలి.  తరిగిన బెల్లాన్ని ఉండ పాకం వచ్చేలా పాకంగా తయారుచేయాలి.
3. ఈ పాకంలో  బియ్యపు పిండిని కలిపి ముద్దగా అయ్యేలా చేసుకోవాలి. ఇలా తయారైన ముద్దను చలిమిడి అంటారు.
4. ఈ చలిమిడిని చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో వత్తి గుండ్రంగా చేసుకోవాలి.
5. ఆ గుండ్రని అప్పచ్చులను బాణలిలో కాగుతున్న నెయ్యి/నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
6. ఆ తరువాత బయటికి తీసి అరిసెల గరిటెలతో/చెక్కలతో గట్టిగా వత్తి కాసేపు ఆరబెట్టాలి.
7. ఇవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి.






No comments:

Post a Comment