- See more at: http://mybloggerwidgets.blogspot.in/2013/03/add-floating-facebook-like-box-in.html#sthash.2Osw38PV.dpuf

Tuesday, 26 July 2016

ఆలూ పరాఠా

కావలసిన పదార్థములు:
గోధుమ పిండి – 1 కప్పు
నీళ్ళు – ½ కప్పు
ఉప్పు తగినంత
స్టఫింగ్ కొరకు
బంగాళాదుంపలు – 2 మీడియం సైజువి
ఉప్పు - ¼ టీ స్పూన్
జీలకర్ర – ½ టీస్పూన్
పచ్చిమిర్చి – 1 బాగా తరిగినది
కొత్తిమీర – 2టేబుల్ స్పూన్స్
నూనె
తయారుచేయు విధానం
ముందుగా బంగాళాదుంపలు ఉడికించి మాష్ చేసి ప్రక్కన ఉంచుకోవాలి.  
గోధుమపిండిని ఉప్పు, నీళ్ళు వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి.
ఉడికించిన బంగాళాదుంపలో కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
చపాతీపిండిని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి.
ఒక్కొక్క ఉండ తీసుకొని చపాతీలాగా వత్తుకుని అందులో ఆలూ ముద్దని ఉంచి మళ్ళీ చపాతీలాగా వత్తుకోవాలి.
స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేసి రెండువైపులా కాల్చుకోవాలి.
పెరుగుతో, టమాటో చట్నీతో తినవచ్చు.



No comments:

Post a Comment