- See more at: http://mybloggerwidgets.blogspot.in/2013/03/add-floating-facebook-like-box-in.html#sthash.2Osw38PV.dpuf

Tuesday, 26 July 2016

చెక్కలు

కావలసిన పదార్థములు:
బియ్యపు పిండి – 1 కప్
నువ్వులు – 1 టేబుల్ స్పూన్
శనగపప్పు – 1 టీ స్పూన్
పెసరపప్పు - 1 టీ స్పూన్
ఉప్పు తగినంత
ఇంగువ చిటికెడు
అల్లం పేస్ట్ – 1/2 టీస్పూన్
తరిగిన పచ్చిమిర్చి – 1
నూనె/వెన్న – 2 టేబుల్ స్పూన్స్
నీళ్ళు – 1/3 కప్
కరివేపాకు
జీలకర్ర
వేయించడానికి సరిపడా నూనె
తయారుచేయు విధానం
ముందుగా బియ్యపుపిండిలో నువ్వులు, ఇంగువ, శనగపప్పు, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, నూనె వేసి బాగా కలపాలి.
తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోస్తూ కలుపుకోవాలి.
ఆ తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని చేతితో/అప్పడాల కర్రతో వత్తుకుని నూనెలో వేయించాలి.   



No comments:

Post a Comment