కావలసిన పదార్దములు:
కాలీఫ్లవర్ - 1
మైదా పి౦డి - 1 cup
కార్నఫ్లోర్ (మొక్కజొన్న పిండి - 1 cup
ఉప్పు - రుచికి సరిపడా
కారం - తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 tbsp
పచ్చిమిర్చి పేస్ట్ - 1 tbsp
టమోటో సాస్ - 3 tbsp
మిరియాల పొడి - చిటికెడు
కొత్తిమీర
తయారు చేయు విధాన౦:
కాలీఫ్లవర్ - 1
మైదా పి౦డి - 1 cup
కార్నఫ్లోర్ (మొక్కజొన్న పిండి - 1 cup
ఉప్పు - రుచికి సరిపడా
కారం - తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 tbsp
పచ్చిమిర్చి పేస్ట్ - 1 tbsp
టమోటో సాస్ - 3 tbsp
మిరియాల పొడి - చిటికెడు
కొత్తిమీర
తయారు చేయు విధాన౦:
- మొదటగా కాలీఫ్లవర్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్టౌ వెలిగించి చిన్న గిన్నె పెట్టి కొద్దిగా నీరు పోసి అందులో కట్ చేసి పెట్టుకొన్న కాలీఫ్లవర్ ముక్కలను అందులో వేసి ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నీరు పోసి తర్వాత కార్న్ ఫ్లోర్, మైదాపి౦డి, కారం, ఉప్పు కొద్దిగా, కార౦ వేసి పకోడిపి౦డిలా కలుపుకోవాలి.
- ఉడికించి పెట్టుకొన్న కాలీఫ్లవర్ ను పైన తయారు చేసిన పకోడిపిండి మిశ్రమంలో వేసి కలిపి పెట్టుకోవాలి
- స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి బాగా వేడి అయ్యాక, పిండిలో కలిపి పెట్టుకొన్న కాలీఫ్లవర్ ను అందులో వేసి బాగా పకోడీల లాగా వేయి౦చాలి.
- మరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి ముద్ద వేసి వేపాలి. ా౦దులో ఉల్లిపాయలు కూడా వేయి౦చాలి. ఇప్పుడు ప్రై చేసి పెట్టుకొన్న కాలీఫ్లవర్ పకోడీలను అందులో వేసి 2 నిమిషాలు వేగనివ్వాలి. వేగాక టమోటా సాస్ వేసి బాగా కలియ బెట్టి స్టౌ మీద నుండి దింపుకోవాలి
- తరువాత కొత్తిమీర తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలతొ గార్నిష్ చేసుకోవాలి. అంతే తినడానికి గోబీమంచూరియా రెడీ.
No comments:
Post a Comment