- See more at: http://mybloggerwidgets.blogspot.in/2013/03/add-floating-facebook-like-box-in.html#sthash.2Osw38PV.dpuf

Saturday, 28 September 2013

సమోసాలు

 కావలసిన పదార్దములు:

మైదా - 3 కప్పులు
బంగాళాదుంపలు - 2 లేదా 3
క్యారెట్ - 1
పచ్చిబఠానీలు - 1 కప్పు
కొత్తిమీర - కావలసినంత
పచ్చి మిరపకాయలు - 2
జీలకర్ర - 1/4 టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
కారం - 1/2 టీ స్పూన్
పసుపు - చిటికెడు
నిమ్మకాయ రసం - అరడిప్ప
ఉప్పు - తగినంత

తయారు చేయు విధానం:


  • 1. బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ లను వేయించాలి
  • 2. తరువాత ఉడికించిన బంగాళాదుంప, క్యారెట్ లను, పచ్చి బఠానీలు పోపులో వేసి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు మరియు కొత్తిమీర వేయాలి 
  • 3. చివరిగా స్టవ్ కట్టేసి నిమ్మరసం పిండాలి. 
  • 4. మైదా పిండిని చపాతీ పిండి లాగా కలుపుకొని చపాతీలలా వత్తుకొని సగానికి కట్ చేయాలి 
  • 5. కోన్ ఆకారంలో చేసి పై మిశ్రమాన్ని అందులో నింపాలి 
  • 6. కొంచెం నీటితో చివరలు ఊడకుండా అతికించాలి.
  • 7. స్టవ్ మీద బాణలి పెట్టి నూనెలో ఎర్రగా వేయించి వేడి వేడిగా సర్వ్ చేయండి. 

No comments:

Post a Comment