కావలసిన పదార్థములు:
బియ్యం - 1/2 కప్
పెసరపప్పు - 2 టేబుల్ స్పూన్స్
బెల్లం - రెండు కప్పులు
ఎండుకొబ్బరి ముక్కలు -2 టేబుల్ స్పూన్స్
నెయ్యి - 4/5 టేబుల్ స్పూన్స్
పచ్చకర్పూరం - చిటికెడు
జీడిపప్పు - 7/8
యాలకుపొడి తగినంత
తయారు చేయు విధానం:
- బియ్యం కడిగి నీరులేకుండా వడేసుకోవాలి.
- పెసరపప్పు దోరగా వేయించుకోవాలి
- బియ్యం, పెసరపప్పు అత్తెసరుకు సరిపడా నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టాలి.
- అన్నం మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి.
- తర్వాత బెల్లం, నెయ్యి పోసి కలిపి మూతపెట్టాలి.
- యాలకుపొడి, పచ్చకర్పూరం వేసి కలపాలి
- నేతిలో వేయించుకొన్న ఎండుకొబ్బరి, జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి
No comments:
Post a Comment