కావలసిన పదార్థములు:
౧. బియ్యం: ఒక కిలో
౨. పచ్చిశనగపప్పు: పావుకిలో
౩. సగ్గుబియ్యం: 100గ్రాములు
౪. మినపగుండ్లు: 100గ్రాములు
౫. నూనె: వేయించడానికి
౬. వెన్న:100గ్రాములు
౭. తగినంత ఉప్పు, కారం
౮. జీలకర్ర, వాము-2టీస్పూన్స్
తయారుచేయువిధానం:
౧. బియ్యం,శనగపప్పు, సగ్గుబియ్యం, మినపగుండ్లు - నాలుగూ కలిపి పిండి పట్టించుకోవాలి.
౨. ఈ పిండిలో తగినంత ఉప్పు, కారం, జీలకర్ర, వాము, వెన్న వేసి బాగా కలపాలి.
౩. తరువాత కొంచెం నీరు కలుపుకుంటూ ముద్దలా కలుపుకోవాలి.
౪. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో నూనె వేడి చేయాలి.
౫. ఈ మిశ్రమాన్ని జంతిల గిద్దలో పెట్టి కాగిన నూనెలో వత్తుకోవాలి.
౬. బంగారు రంగు వచ్చేవరకు రెండువైపులా వేయించి తీసివేయాలి.
కరకరలాడుతూ నోట్లో వేసుకోగానే కరిగిపోయే చక్రాలు రెడీ.

No comments:
Post a Comment