- See more at: http://mybloggerwidgets.blogspot.in/2013/03/add-floating-facebook-like-box-in.html#sthash.2Osw38PV.dpuf

Sunday, 7 September 2014

నిమ్మకాయ పచ్చడి

కావలసిన వస్తువులు:
నిమ్మ కాయలు : 25 ; ఉప్పు : 60 గ్రాములు
కారం : 40 గ్రాములు ; మెంతి పిండి: 20 గ్రాములు
నూనె: 50 గ్రాములు; ఆవాలు: 1 టేబుల్ స్పూన్
ఇంగువ : 1 టేబుల్ స్పూన్ ; ఎండు మిర్చి : 1 లేదా 2
పసుపు: 11/2 టీ స్పూన్

తయారు చేయు విధానం:
మొదట నిమ్మకాయలు శుబ్రంగా కడిగి పొడి గుడ్డతో తుడిచి ఆరబెట్టుకోవాలి . కాయలు ఏమాత్రం తడి వుండకూడదు. పూర్తిగా కాయలు తడి ఆరిన తరువాత కాయను 4 ముక్కలుగా కోసుకోవాలి. కొంచెం చిన్న ముక్కలు కావాలనుకునేవారు చిన్నగా కోసుకోవచ్చు. ముక్కలు ఒక సీసాలో కాని జాడీ లో కాని తరుక్కోవాలి. ఉన్న కాయలులో కొన్ని ముక్కలు తరుక్కుని, మిగతావి రసం పిండుకోవాలి. నిమ్మ రసం, పసుపు, ఉప్పు, జాడిలోని ముక్కల్లో వేయాలి. ముక్కలు బాగా కలిపి మూత పెట్టి ఉంచాలి.

మరునాడు ముక్కలను మాత్రం ఒక ప్లేట్ లోకి తీసుకుని ఎండబెట్టుకోవాలి. అలా ముక్కలను ఎండే వరకు సుమారు 3 రోజులు ఎండబెట్టాలి. మూడవ రోజు నిమ్మ రసంలో మెంతి పిండి, చెప్పిన కారం లో సగం భాగం కలిపి, ఎండిన ముక్కలను కూడా వేసి బాగా కలపాలి. ఒక బాండీ తీసుకుని అందులో 50 గ్రాముల నూనె వేసి వేడెక్కాక ఆవాలు వేసి చిటపట లాడేక ఎండుమిర్చి, ఇంగువ వేసి స్టవ్ ఆపెయాలి. ఇపుడు వేడి నూనెలో కారం లో మిగతా సగ భాగం వేయాలి. పోపు చల్లరేక నిమ్మకాయ పచ్చడి లో కలపాలి. కలిపిన పచ్చడిని జాడి లో కాని ,సీసాలో కాని తీసి పెట్టుకోవాలి.

No comments:

Post a Comment