- See more at: http://mybloggerwidgets.blogspot.in/2013/03/add-floating-facebook-like-box-in.html#sthash.2Osw38PV.dpuf

Monday, 16 March 2015

సుగంధ సుపారీ

అల్లమును చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి.
ఎండిన ఉసిరికాయ లను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి.
సోపు , జీలకర్ర, ధనియాలు , తేమ ఉంటే పోయేలా లైటుగా వేయించుకోండి
అన్నీ సమపాళ్ళలో తీసుకోవచ్చు , లేదా ఎవరికైనా ఏదైనా ఎక్కువ ఇష్టమయితే దాన్ని కాస్త ఎక్కువ తీసుకోవచ్చు.
వీటన్నిటినీ ఒక మట్టి మూకుడులో వేసి, తగినంత నిమ్మరసం పిండి, దానిలో రాత్రంతా నానేయండి.
మర్నాడు దాన్ని అలాగే ఎండలో పెట్టి బాగా ఎండించండి. దానికి రుచికోసం కొద్దిగా సైంధవ లవణము , కొద్దిగా జాజికాయ , జాపత్రి కలపండి. కావలసినట్టుగా మెత్తగా కానీ , గరకుగా కానీ నూరుకోండి. కొందరు నూరకుండా అలాగే జాగ్రత్త పరచుకుంటారు. ఇదే సుగంధ సుపారీ.
దీన్ని అప్పుడప్పుడు నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండచ్చు.
నోటికి సువాసనా , పొట్టకు ఆరోగ్యమూ , జీర్ణమూ వంటి గుణాలు వస్తాయి.

No comments:

Post a Comment